గడిచిన దశాబ్దం కాలంలో తెలుగు సినిమా సహా భారతీయ సినిమా ఎంతో పురోగతి చూసింది. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ తాలూకా రీచ్ ప్రపంచ వ్యాప్తంగా మరో లెవెల్ కి వెళ్లగా ఇపుడు ఈ ట్రెండ్ లో కొత్త ట్రెండ్ కి పునాది వేసుకుంది. ఇన్నాళ్లు భారీ తారాగణం, గ్రాండ్ గ్రాఫిక్స్ లాంటి ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకి థియేటర్స్ లో సాలిడ్ ట్రీట్ ఇస్తే అవి పెద్ద సక్సెస్ అయ్యాయి.
కానీ ఇపుడు రూటు మారింది. వీటితో పాటుగా యానిమేషన్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. అయితే ఈ ప్రభావం అంతా మహావతార్ నరసింహ కే దక్కుతుంది అని చెప్పాలి. అసలు కనీసం డబ్బింగ్ కి కూడా ఎలాంటి స్టార్ సహాయం తీసుకోకుండానే మహావతార్ నరసింహ చిత్రం సృష్టించిన వండర్స్ చూసి ట్రేడ్ వర్గాలు షాకయ్యారు.
మరి ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా తర్వాత మరిన్ని యానిమేషన్ సినిమాలు అనౌన్స్ అవుతున్నాయి. మహావతార్ నరసింహ అదరగొడుతున్న కొన్ని రోజులకే బాలీవుడ్ నుంచి “చిరంజీవి హనుమాన్” అనే పూర్తి యానిమేటెడ్ అది కూడా ఏఐ తో రూపొందించిన సినిమాగా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు మరో సినిమాగా మన తెలుగు నుంచి “వాయుపుత్ర” అనే భారీ యానిమేటెడ్ చిత్రం అనౌన్స్ అయ్యింది.
దీనితో ఈ ట్రెండ్ ఎఫెక్ట్ అంతా మహావతార్ నరసింహ వల్లే అని చాలా మంది ఆల్రెడీ మాట్లాడ్డం మొదలు పెట్టారు. కానీ ఇదే యానిమేటెడ్ గా దేవుని విషయంలో చూసుకుంటే మన తెలుగు నుంచి సూపర్ హీరో చిత్రం “హను మాన్”లో దర్శకుడు ప్రశాంత్ వర్మ దీనిని స్టార్ట్ చేసాడని చెప్పవచ్చు. నిజ రూపానికి బదులుగా యానిమేటెడ్ వెర్షన్ ని ప్రెజెంట్ చేసి తాను సెన్సేషనల్ హిట్ కొట్టాడు.
అయితే దీని ప్రేరణగా మహావతార్ నరసింహ అని చెప్పడానికి లేదు. కానీ మరో ఆసక్తికర అంశం ఏంటంటే ప్రశాంత్ వర్మ యానిమేటెడ్ హను మాన్ వెర్షన్ తర్వాత మహావతార్ వస్తే మళ్ళీ దాని తర్వాత యానిమేటెడ్ లో అనౌన్స్ అయ్యిన సినిమాలు కూడా ఆ ఆంజనేయుడు మీదనే ఉండటం గమనార్హం. ఇది ఒక ఆసక్తిర యాదృచ్చికం అని కూడా చెప్పొచ్చు.