ట్యాలెంటెడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన తన కెరీర్‌లో 41వ చిత్రాన్ని రీసెంట్‌గా ప్రారంభించాడు. ఈ సినిమాను దర్శకుడు రవి నేలకుడితి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ పూజా హెగ్డే నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా వారు షేర్ చేశారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని.. అభిమానులను ఈ జోడీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Welcoming the enchanting @hegdepooja on board for #DQ41 ❤️
DQ and Pooja's chemistry will be magical on the big screens ✨
Stay tuned for more updates.#SLVC10
Starring @dulQuer
Directed by @ravinelakuditi9
Produced by @sudhakarcheruk5 under @SLVCinemasOffl
Music by @gvprakash… pic.twitter.com/vVb3LSbNHI— SLV Cinemas (@SLVCinemasOffl) September 10, 2025