ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!

ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!

Published on Sep 10, 2025 4:01 PM IST

మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య జంటకు నేడు(సెప్టెంబర 10) పండంటి మగబిడ్డ పుట్టాడు. దీంతో కొణిదెల ఇంట వారసుడి రాకతో కుటుంబ సభ్యులు ఆనందంతో మురిసిపోతున్నారు. బిడ్డ, తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారని మెగా ఫ్యామిలీ చెబుతున్నారు.

ఇక తమ ఇంట అడుగుపెట్టిన బుజ్జాయిని మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆశీర్వదించాడు. తమ కుటుంబంలోకి కొణిదెల వారసుడిని ఆహ్వానిస్తున్నామని.. ఈ బాబు రాకతో తల్లిదండ్రులుగా మారిన వరుణ్ తేజ్-లావణ్య, తాత-నాన్నమ్మగా మారిని నాగబాబు-పద్మజలకు శుభాకాంక్షలు అని చిరు తెలిపారు. బాబును తన చేతుల్లో ఎత్తుకుని మెగాస్టార్ మురిసిపోయారు.

దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. తమ వారసుడికి అభిమానుల ఆశీస్సులు కూడా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు