అల్లు అర్జున్ లాంచ్ చేసిన మంచు లక్షి ‘దక్ష’ ట్రైలర్

అల్లు అర్జున్ లాంచ్ చేసిన మంచు లక్షి ‘దక్ష’ ట్రైలర్

Published on Sep 9, 2025 11:48 PM IST

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. తండ్రీ-కూతుళ్లు కలిసి తెరపై కనిపించడం ఈ చిత్ర ప్రత్యేకత. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘‘నా ఫ్రెండ్ లక్ష్మి మంచు, మోహన్ బాబు గారితో కలిసి చేసిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్‌కి స్పెషల్ థ్యాంక్స్. దుబాయ్‌లో జరిగిన సైమా-2025లో కూడా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. లక్ష్మిగారి కెరీర్‌లో కొత్తగా నిలిచే పాత్ర ఇది. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలయ్యే మా సినిమాను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు.

తాజా వార్తలు