ఒకే రోజులో 15 సినిమాలు ప్రారంభించి ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తన పుట్టినరోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
తెలుగు సినిమాకి ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని, ఈ విజయానికి తన వెనుక ఉన్న వందలాది మందే కారణమని చెప్పారు. ప్రస్తుతం యండమూరి కథలు, కె.పి.హెచ్.బి. కాలనీలో, మా నాన్న హీరో, మహానాగ చిత్రాల షూటింగ్ జరుగుతుండగా.. మిగతావి ప్రీ-ప్రొడక్షన్లో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఓ భారీ బడ్జెట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నానని చెప్పారు.
ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తిచేసుకున్న ఈ సందర్భంగా, తొలి దశలో ఎన్నో కష్టాలు ఎదురైనా, కుటుంబం అండతో ఈ స్థాయికి చేరానని భావోద్వేగంగా చెప్పారు. నిర్మాతగా 200 సినిమాలు పూర్తి చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు.