AA22 కోసం అట్లీ రెక్కీ.. ఎక్కడో తెలుసా?

AA22 కోసం అట్లీ రెక్కీ.. ఎక్కడో తెలుసా?

Published on Sep 9, 2025 5:00 PM IST

AA22xA6

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో కలిసి AA22xA6 ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాను ప్రపంచంలోని పలు దేశాల్లో చిత్రీకరణ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ కోసం సరైన లోకేషన్స్‌ను పట్టుకునేందుకు దర్శకుడు అట్లీ రెక్కీ నిర్వహిస్తున్నాడు. సౌదీ అరేబియాలోని అబుదాబిలో ఉన్న లివా ఎడారుల్లో అట్లీ ప్రస్తుతం ఈ చిత్రానికి సరిపోయే లోకేషన్ కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ఈ విషయాన్ని తెలిపారు.

దీంతో ఈ సినిమాను వరల్డ్ క్లాస్‌గా తీర్చిదిద్దేందుకు అట్లీ ఎక్కడివరకు అయినా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు వేరే లెవెల్‌లో క్రియేట్ అవుతున్నాయి.

తాజా వార్తలు