“ఓజి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్!?

“ఓజి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్!?

Published on Sep 9, 2025 7:00 AM IST

OG-1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ ఉన్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులుకి ఇప్పుడు మరో క్రేజీ ట్రీట్ కోసం రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇపుడు డేట్ లాక్ అయ్యిందట.

ప్రస్తుతం స్ట్రాంగ్ బజ్ ప్రకారం మేకర్స్ ఈ సెప్టెంబర్ 20న ఈవెంట్ చేయాలని చూస్తున్నారట. అలాగే ఈసారి ఈవెంట్ ని ఆంధ్రప్రదేశ్ లోనే చేస్తారట. సో మొత్తానికి మాత్రం ఫాన్స్ కి ఇంకొన్ని రోజుల్లో సెన్సేషనల్ ట్రీట్ ఉండబోతోందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డివివి దానయ్య నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు