మన టాలీవుడ్ లో లేటెస్ట్ గా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకెళ్తున్న చిత్రం “లిటిల్ హార్ట్స్”. ఇలా గడిచిన ఈ కొన్నాళ్లలో మన తెలుగు సినిమా నుంచి వచ్చిన మరో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ చిత్రమే “జాతి రత్నాలు”. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాని అనుదీప్ కేవీ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఈ సినిమా మొదట నవీన్ దగ్గరకి కాకుండా మరో యంగ్ హీరో దగ్గరకి వెళ్లిందట.
మరి ఆ హీరో ఎవరో కాదు హను మాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు మరో సూపర్ హీరో సినిమా మిరాయ్ తో పలకరించేందుకు వస్తున్న తేజ సజ్జ అట. తన దగ్గరకి ఈ కథ ముందు వచ్చింది కానీ ఆ సినిమా ఫైనల్ గా నవీన్ దగ్గరకి వెళ్ళింది. ఆ రోల్ ని తనకంటే బాగా ఎవరూ చేయలేరని తేజ తెలిపాడు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ విషయంలో అంతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బయటకి వచ్చింది అని చెప్పాలి.