మలయాళ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్స్ లో మోహన్ లాల్ అలాగే మమ్ముట్టిల కోసం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా వీరి సినిమాలు వస్తున్నాయి అంటే మలయాళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. మరి నేడు మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా అనేక సినీ ప్రముఖులు తనకి బర్త్ డే విషెస్ చేస్తున్నారు.
మరి లేటెస్ట్ గా తన సమఉజ్జి మోహన్ లాల్ స్పెషల్ విషెస్ చెప్పడం వైరల్ గా మారింది. తాము ఇద్దరూ కలిసి ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్ పిక్ ని తాను షేర్ చేసుకొని విష్ చేశారు. మరి ఇందులో ఇద్దరు మెగా హీరోస్ రాయల్ లుక్ లో కనిపిస్తున్నారు. దీనితో వీరి ఫ్యాన్స్ ఈ ఫ్రేమ్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే మోహన్ లాల్ నుంచి హృదయపూర్వం సినిమా రాగా మమ్ముట్టి మహేష్ నారాయణన్ తో ఓ సినిమా చేస్తున్నారు.