‘మిరాయ్’కి కేవలం ఓటిటి, శాటిలైట్ హక్కులతోనే అంత వచ్చేసిందా?

‘మిరాయ్’కి కేవలం ఓటిటి, శాటిలైట్ హక్కులతోనే అంత వచ్చేసిందా?

Published on Sep 3, 2025 1:15 PM IST

Mirai

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన భారీ చిత్రం “మిరాయ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా రిలీజ్ కి ముందే పెట్టిన బడ్జెట్ తో చాలానే కేవలం ఓటిటి, శాటిలైట్ హక్కులతో రాబట్టినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాకి 60 కోట్లకి పైగా బడ్జెట్ పెడితే అందులో 45 కోట్లు మొత్తం ఓటిటి, శాటిలైట్ హక్కులతోనే వచ్చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో మిరాయ్ కి నెలకొన్న డిమాండ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. మరి థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందించగా మంచు మనోజ్ విలన్ గా నటించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు