అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!

అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!

Published on Aug 26, 2025 9:38 PM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర మంచి ఆదరణ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో స్వీటీ అనుష్క కూడా ఒకరు. మరి తన నుంచి లేటెస్ట్ గా రాబోతున్న అవైటెడ్ చిత్రమే ‘ఘాటీ’. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో చేస్తున్న ఈ అవైటెడ్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అలాగే చాలా కాలం గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆమె నుంచి ప్రమోషన్స్, ఆఫ్ లైన్ లో కూడా చూడొచ్చు అనుకున్నారు కానీ ఇపుడు వారి ఆశలకు బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కనీసం ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా అనుష్క హాజరు కావడం లేదని ఈ సినిమా మేకర్స్ చెబుతున్నారు.

ఈ ఒప్పంద ప్రాతిపదికనే అనుష్క సినిమా ఒప్పుకున్నారు అని అందుకే ఇపుడు ప్రమోషన్స్ సహా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె కనిపించరు అని కన్ఫర్మ్ అయ్యింది. ఇది మాత్రం స్వీటీ ఫ్యాన్స్ కి దారుణంగా డిజప్పాయింట్ చేసే వార్తే అని చెప్పక తప్పదు.

తాజా వార్తలు