అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!

అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!

Published on Aug 26, 2025 1:00 AM IST

Allu Arjun Atlee

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం ‘AA22’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు.

ప్రేక్షకులలో ఈ సినిమాపై గ్లోబల్ లెవెల్‌లో హైప్ క్రియేట్ చేయడానికి నిర్మాతలు భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా, హాలీవుడ్‌ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్ సీన్(Connekkt Mob Scene) ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిందట. ఈ ఏజెన్సీకి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి తొలిసారి ఇండియాకు వచ్చారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌తో ప్రమోషన్ స్ట్రాటజీని సిద్ధం చేయడం కోసం ఈ విజిట్ జరిగినట్లు సినీ వర్గాల సమాచారం.

సినిమా టీమ్ అంతర్జాతీయ మార్కెట్లో AA22కి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అల్లు అర్జున్ ఇప్పటికే పాన్-ఇండియా స్టార్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ మూవీని వరల్డ్ క్లాస్ ప్రమోషన్‌తో కొత్త రికార్డులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు