‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Published on Aug 21, 2025 4:19 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రమే “ఆంధ్ర కింగ్ తాలూకా”. మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని కూడా చూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పుడు బయటకి వచ్చేసింది.

దీనితో ఆంధ్రా కింగ్ తాలూకా ఈ ఏడాది నవంబర్ 28 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ఒక క్రేజీ పోస్టర్ ని రామ్ పై డిజైన్ చేసి అనౌన్స్ చేశారు. సో రామ్ ఫ్యాన్స్ సహా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ అప్పుడు వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాకి వివేక్ మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో అయినా రామ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడా లేదా చూడాలి.

తాజా వార్తలు