గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2’ శరవేగంగా తెరకెక్కుతోంది. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు నెట్‌ఫ్లక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు భారీ ధర కోట్ చేస్తున్నాయట. అయితే, జియో హాట్‌స్టార్ ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లకంటే కూడా ఎక్కువ మొత్తంలో కోట్ చేసిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకునేందుకు జియో హాట్‌స్టార్ గట్టిగా ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, సంయుక్తా మీనన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.