మెగా 157 టైటిల్ లాంచ్‌కు డేట్, టైమ్ ఫిక్స్..!

మెగా 157 టైటిల్ లాంచ్‌కు డేట్, టైమ్ ఫిక్స్..!

Published on Aug 19, 2025 8:05 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేయనున్నారు. ఇక ఈ మెగా బర్త్‌డే వేడుకలు ఆగస్టు 21న సాయంత్రం 4.32 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో మెగా157 టైటిల్ కూడా రివీల్ చేయనున్నారు.

దీంతో మెగా ఫ్యాన్స్‌కు చిరు బర్త్ డే సందర్భంగా అదిరిపోయే ట్రీట్ రానుందనేది కన్ఫమ్. ఇక మెగా 157 చిత్రంలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు