‘ఓజి’ ఆగమనం.. ఆల్ సెట్!

‘ఓజి’ ఆగమనం.. ఆల్ సెట్!

Published on Aug 19, 2025 3:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ హైప్ దీని పట్ల ఇపుడు ఉంది. అందుకే ఎన్ని సినిమాలు ఉన్నా ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓజి సినిమా రిలీజ్ తోనే అఖండ 2 క్లాష్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ వస్తే రెండిట్లో ఒకటే సినిమా వస్తుంది అని సినీ వర్గాల్లో టాక్ ఉంది.

కానీ ఇపుడు వచ్చే ఆ ఒక్క సినిమా ఓజి మాత్రమే అని కన్ఫర్మ్ అయ్యినట్టు రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని ఏరియాస్ లో కూడా మేకర్స్ బిజినెస్ ని కూడా క్లోజ్ చేసేసారట. దీనితో ఈ సెప్టెంబర్ 25న ఓజి ఆగమనం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు