11 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ట్రాక్ బ్రేక్..!

11 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ ట్రాక్ బ్రేక్..!

Published on Aug 19, 2025 3:00 AM IST

jr-ntr

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘వార్ 2’ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటించిన ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. ఇక యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది.

అయితే, ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ సినిమా ఫలితం చూస్తుంటే, ఇది ఫ్లాప్ దిశగా వెళ్తుందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ తన కెరీర్‌లో గత 11 ఏళ్లుగా కంటిన్యూ చేస్తున్న సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అయిందని చెప్పాలి.

మరి ఈ సక్సెస్ ట్రాక్‌ని ఎన్టీఆర్ తిరిగి తన నెక్స్ట్ చిత్రంతో కంటిన్యూ చేయాలని అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేస్తుండటంతో అభిమానుల ఆశలు ఈ సినిమాపైనే ఉన్నాయి.

తాజా వార్తలు