వార్ 2, కూలీ కాదు డే 22 ‘మహావతార్ నరసింహ’ డామినేషన్ మరో లెవెల్

వార్ 2, కూలీ కాదు డే 22 ‘మహావతార్ నరసింహ’ డామినేషన్ మరో లెవెల్

Published on Aug 15, 2025 3:01 PM IST

Coolie-vs-Mahaavatr-vs-war2

ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో యానిమేషన్ సినిమా “మహావతార్ నరసింహ” కూడా ఒకటి. పూర్తిగా దైవత్వం అందులో సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ తో దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదల అయ్యి 22 రోజులు గడుస్తుంది.

ఈ మధ్యలోనే హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి సినిమాలు దాటుకొని ఇప్పుడు వార్ 2, కూలీ లాంటి భారీ సినిమాలు వచ్చినప్పటికీ విధ్వంసం సృష్టిస్తుంది. ఈ కొత్త సినిమాలు నిన్ననే వచ్చినప్పటికీ వాటికి రెండో రోజు దీనికి 22వ రోజు బుకింగ్స్ చూస్తే షాక్ కావాల్సిందే. ఎందుకంటే బుక్ మై షోలో ప్రతీ గంట బుకింగ్స్ అప్డేట్ లో వార్ 2 కి 60 వేలకి పైగా టికెట్స్ ట్రెండింగ్ లో ఉంటే కూలీ సినిమాకి 39 వేలు ఉంది.

ఇక మహావతార్ నరసింహ 20 వేల టికెట్స్ ని సొంతం చేసుకుంది అంటే కూలీలో సగానికి టికెట్ ఈ సినిమాకి తెగుతున్నాయి. అది కూడా కొత్త సినిమాలతో పోలిస్తే 22 రోజుల కితం సినిమా ఈ రేంజ్ బుకింగ్స్ కనబర్చడం అది కూడా ఎలాంటి స్టార్స్ లేని సినిమా అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఈ డామినేషన్ మరో లెవెల్ అని చెప్పి తీరాల్సిందే. ఇక వసూళ్ల పరంగా ఎలాంటి లెక్కలు వస్తాయో చూడాలి.

తాజా వార్తలు