డే 1 రెండు తెలుగు స్టేట్స్ లో ‘వార్ 2’, ‘కూలీ’ ఏ మేర రాబట్టొచ్చంటే!

డే 1 రెండు తెలుగు స్టేట్స్ లో ‘వార్ 2’, ‘కూలీ’ ఏ మేర రాబట్టొచ్చంటే!

Published on Aug 13, 2025 2:00 PM IST

war2-coolie

చాలా రోజులు తర్వాత మళ్ళీ సౌత్ సినిమాలో సినిమాల హంగామా గట్టిగా వినిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్న సందర్భంగా హీట్ ఓ రేంజ్ లో ఉంది. అయితే వార్ 2 ఇంకా కూలీ రెండు సినిమాలూ మనకి డబ్బింగ్ లోనే వస్తున్నాయి.

ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజు సాలిడ్ వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉన్నట్టు ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. దీని ప్రకారం వార్ 2 చిత్రానికి మొదటి రోజే 20 కోట్ల దగ్గర షేర్ వచ్చే ఛాన్స్ ఉందట. ఇక అలాగే కూలీ సినిమాకి డే 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల షేర్ వచ్చే ఛాన్స్ ఉందట.

ఇలా మొత్తానికి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ, వార్ 2 లు భారీ ఓపెనింగ్స్ ని అందుకుంటాయని చెప్పవచ్చు. రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ ల కూలీ తెలుగు స్టేట్స్ లో 44 కోట్ల బిజినెస్ చేస్తే ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 మాత్రం డబుల్ మొత్తంలో 90 కోట్ల బిజినెస్ టార్గెట్ తో రాబోతుంది.

తాజా వార్తలు