వరల్డ్ వైడ్ ‘కూలీ’ డే 1 కలెక్షన్ ప్రిడిక్షన్!

వరల్డ్ వైడ్ ‘కూలీ’ డే 1 కలెక్షన్ ప్రిడిక్షన్!

Published on Aug 13, 2025 9:00 AM IST

COOLIE Rajinikanth

ప్రస్తుతం మన దక్షిణాది సినిమా నుంచి సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసుకొని రిలీజ్ కి వస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన భారీ చిత్రం “కూలీ” అని చెప్పాలి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో చేసిన ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ హైప్ ని ప్రపంచ వ్యాప్తంగా సెట్ చేసుకొని విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా బుకింగ్స్ ఎప్పుడైతే తెరుచుకున్నాయో అప్పుడు నుంచే సాలిడ్ బుకింగ్స్ కొనసాగుతుండగా డే 1 కి మాత్రం తమిళ సినిమా నుంచి రికార్డు ఓపెనర్ గా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే కనిపిస్తుంది.

ఇలా డే 1 కి కూలీ సునాయాసంగా 100 కోట్ల గ్రాస్ ని ఓపెన్ చేయగా ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లతో కూడా కలిపి తమిళ్ బిగ్గెస్ట్ ఓపెనర్ ‘లియో’ 147 కోట్ల గ్రాస్ ని కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో మొదటిరోజుకి మాత్రం 150 నుంచి 160 కోట్ల గ్రాస్ గ్యారెంటీ అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. మరి చూడాలి కూలీ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనేది.

తాజా వార్తలు