కూలీ, వార్ 2 టికెట్ బుకింగ్స్.. ఇక్కడ కూడా యుద్ధం మొదలు..!

కూలీ, వార్ 2 టికెట్ బుకింగ్స్.. ఇక్కడ కూడా యుద్ధం మొదలు..!

Published on Aug 12, 2025 7:56 PM IST

war2-coolie

ఈ వారం బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగుతున్న చిత్రాలు కూలీ, వార్ 2. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలు ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుండటంతో, తాజాగా ఈ చిత్రాలకు సంబంధించి తెలుగులో టికెట్ బుకింగ్స్ తెరుచుకున్నాయి.

తెలంగాణలో ఈ సినిమాల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్ రేట్ల పెంపు కోసం ఈ రెండు చిత్రాలు ప్రయత్నించినా, తెలంగాణ సర్కార్ నో చెప్పడంతో సాధారణ టికెట్ రేట్లకే ఈ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే, ఏపీలో ఈ చిత్రాలకు కొంతమేర టికెట్ ధరల పెంపు ఉండనుంది. అక్కడ కూడా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానుండటంతో ఈ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ చిత్రాన్ని ఏషియన్ సురేష్ రిలీజ్ చేస్తుండగా.. వార్ 2 చిత్రాన్ని నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు