‘పరదా’ పై పూర్తి కాన్ఫిడెన్స్.. అందుకే వెనకడుగు వేయమంటున్న అనుపమ..!

‘పరదా’ పై పూర్తి కాన్ఫిడెన్స్.. అందుకే వెనకడుగు వేయమంటున్న అనుపమ..!

Published on Aug 12, 2025 7:00 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘పరదా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది.

ఇక ఈ సినిమాను ఓ సామాజిక అంశంతో దర్శకుడు తెరకెక్కించినట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా కథపై చిత్ర యూనిట్ పూర్తి ధీమాగా ఉన్నారు. అందుకే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను తామే నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. అయితే, ఇదే విషయంపై తాజాగా అనుపమ కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. తమ సినిమా కంటెంట్‌పై తాము పూర్తి నమ్మకంగా ఉన్నామని.. అందుకే పీఆర్ ప్రమోషన్స్ కాకుండా తామే చేసుకుంటున్నామని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

దీంతో ఈ సినిమాపై ఆమె ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 22న గ్రాండ్ రిలీజ్ చేస్తుండగా యూఎస్‌లో ఆగస్టు 21న ప్రీమియర్స్ వేస్తున్నారు.

తాజా వార్తలు