ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకి థియేటర్స్ లో ఇపుడు రాబోతుంది.
అయితే వార్ సహా టోటల్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ తాలూకా సినిమాలు అన్నీ భారీ యాక్షన్ సినిమాలే.. ఇలానే వార్ 2 కూడా క్రేజీ యాక్షన్ బ్లాక్ లతో నిండిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం 6 దుమ్ములేపే యాక్షన్ సన్నివేశాలు పర్ఫెక్ట్ కట్ తో సిద్ధంగా ఉన్నాయట. ఇక వీటితో పాటుగా క్లైమాక్స్ లో అదిరే సర్ప్రైజ్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ గా రెండు కన్ఫర్మ్ అట. మొత్తానికి మాత్రం వార్ 2 తో ప్యాకెడ్ ట్రీట్ సిద్ధంగా ఉందని చెప్పవచ్చు.