అక్కడ ‘కూలీ’ రికార్డ్ వసూళ్లు.. ఫస్ట్ ఎవర్ తమిళ్ సినిమాగా!

అక్కడ ‘కూలీ’ రికార్డ్ వసూళ్లు.. ఫస్ట్ ఎవర్ తమిళ్ సినిమాగా!

Published on Aug 12, 2025 11:02 AM IST

COOLIE Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ చిత్రమే “కూలీ”. సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ కి ముందు పలు భారీ రికార్డులు సెట్ చేస్తుంది. ఇలా యూఎస్ మార్కెట్ లో ఒక సంచలన ఓపెనింగ్ పై కన్నేసిన కూలీ కేవలం ప్రీ సేల్స్ లోనే రికార్డు వసూళ్లతో మొదలు పెట్టింది.

ఇలా ప్రస్తుతం ఏకంగా తమిళ్ సినిమాలోనే 2 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకున్న మొదటి సినిమాగా కొత్త రికార్డు సెట్ చేసింది. ఇంకా రిలీజ్ కి మరో రోజు మిగిలి ఉండగానే ఈ మార్క్ అందుకోవడం విశేషం. దీనితో కూలీ పవర్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 14న సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

తాజా వార్తలు