మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రమే “వార్ 2”. ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న ఈ సినిమా తాలూకా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ తెలుగులో నేడు జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో తారక్ స్పీచ్ మంచి హైలైట్ గా నిలవగా చివరలో తన ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైటెడ్ గా మార్చేశాడు.
ఇది వరకు తన ఫ్యాన్స్ కి సింగిల్ కాలర్ ఎత్తి తమని ఎప్పుడు తల దించుకునేలా వర్క్ చేయనని కాలర్ ఎత్తే లానే శ్రమిస్తాను అని ప్రామిస్ చేసాడు. మరి వార్ 2 ఈవెంట్ లో అంతకు మించి డబుల్ కాలర్ ఎత్తడం అనేది బిగ్గెస్ట్ హైలైట్ గా మారింది. వార్ 2 అదిరిపోయిందని చెప్పగా ఇదే మూమెంట్ లో తారక్ తో పాటుగా హృతిక్ కూడా వచ్చి డబుల్ కాలర్ ఎత్తడం మరో బిగ్గెస్ట్ మూమెంట్ గా మారి నేటికి పిక్ ఆఫ్ ది డే గా నిలిచింది. దీనితో ఈ పిక్స్ వైరల్ గా మారాయి.