‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ రూమర్ ?

‘బన్నీ – అట్లీ’ సినిమా పై క్రేజీ రూమర్ ?

Published on Aug 10, 2025 12:00 PM IST

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా పై ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బన్నీకి సిస్టర్ రోల్ ఉందని.. ఈ పాత్ర చాలా ఎమోషనల్ టోన్ లో సాగుతుందని.. ఈ పాత్రలో ఓ సీనియర్ హీరోయిన్ నటించబోతుందని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. అన్నట్టు బన్నీ పాత్రలో మూడు కోణాలు ఉంటాయని, పైగా బన్నీ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని.. ఇలా చాలా రకాల వార్తలు వినిపించాయి.

ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. మరి ఆ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ ఎవర్ని అప్రోచ్ అవుతాడో చూడాలి.

తాజా వార్తలు