పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ‘ది రాజా సాబ్’ చిత్రంతో పాటు ‘ఫౌజీ’ చిత్రాన్ని కూడా ఆయన రెడీ చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ప్రభాస్ నటించబోయే నెక్స్ట్ చిత్రం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఉండబోతుంది.
‘స్పిరిట్’ అనే టైటిల్ను ఇప్పటికే ఫిక్స్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ ఓ కాప్ పాత్రలో నటించనున్నాడు. అయితే, ఈ సినిమాలో కొరియన్ నటుడు డాంగ్ లీ విలన్గా ఇండియన్ సినిమాకు పరిచయం కానున్నాడనే వార్త అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే వార్తకు సంబంధించి సందీప్ రెడ్డి ఓ క్లూ ఇచ్చాడు.
తాజాగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. అక్కడున్న అభిమానులు వేసిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ‘స్పిరిట్’ సినిమాలో విలన్ డాంగ్ లీ నా అంటూ అభిమానులు అడిగారు. దీనికి సందీప్ రెడ్డి.. మీరు అనుకున్నదే జరుగుద్ది.. అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో స్పిరిట్ చిత్రంతో డాంగ్ లీ విలన్గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడనేది దాదాపుగా కన్ఫర్మ్ అయింది.