కియారా ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘వార్ 2’లో అవి కట్..!

కియారా ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘వార్ 2’లో అవి కట్..!

Published on Aug 10, 2025 3:00 AM IST

war2

ప్రస్తుతం బాలీవుడ్ నుంచి వస్తున్న అతిపెద్ద స్పై సీక్వెల్ చిత్రం ‘వార్ 2’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఓ పాటలో బికినీ వేర్‌తో చేసిన రచ్చ మామూలుగా లేదు. అయితే, ఇప్పుడు ఇదే ఆమె ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమా సెన్సార్‌కు వెళ్లినప్పుడు కియారా అద్వానీ ఎరాటిక్ సీన్స్‌ను 9 సెకన్ల పాటు తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది.

దీంతో ఈ సినిమాలోని ఆమె సీన్స్ 9 సెకన్ల పాటు కట్ చేశారట మేకర్స్. ఇక ఈ ఎరాటిక్ సీన్స్ ఎలా ఉన్నాయా అనేది అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటమే కాకుండా, వారి మంచి థ్రిల్‌ను కూడా అందిస్తుందట.

తాజా వార్తలు