ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అంతా ఎదురు చూస్తున్న బిగ్ ప్రాజెక్ట్ లలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. సాలిడ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరింత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ మిస్ అయ్యింది. దేవర తో అవుతుంది అనుకుంటే చివరి నిమిషంలో ప్లాన్ ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు వార్ 2 కి అవుట్ డోర్ లో పర్మిషన్ వచ్చింది కానీ ఈ ఈవెంట్ కోసం ఆల్రెడీ పక్కా సన్నాహాలు జరుగుతున్నాయట.
ముఖ్యంగా ఈవెంట్ లో రక్షణ పరంగా పోలీస్ యంత్రాంగం పకట్బందీగా ప్లాన్ చేస్తున్నారట. కేవలం పాసులు ఉన్న వారినే లోపాలకి రానిచ్చేలా ఎలాంటి తొక్కిసలాటకి తావు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. మరి ఇదంతా ఎన్టీఆర్ అభిమాన జనం ప్రభావమే అని చెప్పి తీరాలి.