హైదరాబాద్లో ఘనంగా మొదలైన అరెరే చిత్రం

హైదరాబాద్లో ఘనంగా మొదలైన అరెరే చిత్రం

Published on Jun 11, 2013 11:55 PM IST

Arerey
‘పంజా’, ‘అలియాస్ జానకి’ సినిమాల నిర్మాణ సంస్థ సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ ‘అరెరే’ అనే మరో సినిమాను నిర్మించనుంది. భిన్న సంస్కృతిల ప్రేమకధ నేపధ్యంలో సాగనున్న ఈ సినిమా చాలా భాగం అమెరికాలో తియ్యనున్నారు. శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈస్ బ్యూటిఫుల్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన అభిజీత్ ఇందులో నటించనున్నాడు. ఈ సినిమా సంఘమిత్ర ఆర్ట్స్ ఆఫీస్ వద్ద ఈరోజు హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఇచ్నేమకు నీలిమ తిరుమలశెట్టి నిర్మాత. మిక్కి జె మేయర్ సంగీత దర్శకుడు. సురేష్ భార్గవ్ సినిమాటోగ్రాఫర్. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా ముఖ్య షెడ్యూల్ మరికొన్ని రోజులలో ప్రారంభంకానుంది

తాజా వార్తలు