‘విశ్వంభర’ నుంచి బ్యూటిఫుల్ గా ఆషిక రంగనాథ్ బర్త్ డే పోస్టర్!

‘విశ్వంభర’ నుంచి బ్యూటిఫుల్ గా ఆషిక రంగనాథ్ బర్త్ డే పోస్టర్!

Published on Aug 5, 2025 12:00 PM IST

 ashika ranganath

టాలీవుడ్ లెజెండరి హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న అవైటెడ్ విజువల్ వండర్ చిత్రమే “విశ్వంభర”. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ భారీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ఇద్దరు హీరోయిన్స్ త్రిష అలాగే ఆషిక రంగనాథ్ లు నటిస్తుండగా నేడు ఆషిక బర్త్ డే కానుకగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

మరి ఈ సినిమాలో ఆషిక లుక్ మాత్రం ఎంతో అందంగా చూసేందుకు ముచ్చటగా కనిపిస్తుందని చెప్పాలి. దీనితో అభిమానులు కూడా ఈ పోస్టర్ చూసి ఆషిక అందానికి ముగ్ధులు అవుతున్నారు. అలాగే అతి త్వరలోనే సినిమా విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు