‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఈ సాంగ్.. ఫ్యాన్స్ కి ఫ్యాన్ బాయ్ గిఫ్ట్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఈ సాంగ్.. ఫ్యాన్స్ కి ఫ్యాన్ బాయ్ గిఫ్ట్

Published on Aug 5, 2025 11:05 AM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కంప్లీట్ అవుతుండగా లేటెస్ట్ గానే ఓ షెడ్యూల్ ని పూర్తి చేశారు. అయితే ఈ షూట్ లోనే క్రేజీ సాంగ్ కూడా పూర్తి చేయగా మేకర్స్ ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా చెబుతున్నారు.

పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పూర్తి చేసిన ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్ నుంచి ఒక గిఫ్ట్ అని అంటున్నారు. ఇక బిగ్ స్క్రీన్స్ పై దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు