నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న “గుర్రం పాపిరెడ్డి” డార్క్ కామెడీ థ్రిల్లర్ టీజర్ హైదరాబాద్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, యోగిబాబు, మూవీ టీమ్ సమక్షంలో విడుదలైంది. డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ జయకాంత్ మాట్లాడుతూ, “ఇది తెలుగులో వస్తున్న డిఫరెంట్ డార్క్ కామెడీ. సినిమా మొత్తం జాయ్ రైడ్ లా ఉంటుంది. బడ్జెట్ పెరిగినా, మా టీమ్ పూర్తి సపోర్ట్ చేసింది. బ్రహ్మానందం, యోగిబాబు లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ” అన్నారు.
ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ, “మేము ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాం. సినిమా మీద ప్యాషన్‌తో ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాం. నరేష్ అగస్త్యకు ఇది టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు లాంటి స్టార్స్‌తో పని చేయడం ఆనందంగా ఉంది” అన్నారు.
మూవీ ప్రెజెంటర్ డా. సంధ్య గోలీ మాట్లాడుతూ, “యూనిక్ డార్క్ కామెడీగా ‘గుర్రం పాపిరెడ్డి’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం, యోగిబాబు లాంటి లెజెండ్స్‌తో వర్క్ చేయడం గర్వంగా ఉంది” అన్నారు.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ, “‘గుర్రం పాపిరెడ్డి’ నాకు స్పెషల్ మూవీ. ఇందులో నేను జడ్జి పాత్రలో కనిపిస్తాను. యంగ్ టీమ్‌తో పని చేయడం కొత్త అనుభూతి. యోగిబాబు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. కొత్తవాళ్లు ఇండస్ట్రీకి రావడం వల్ల ఫ్రెష్‌నెస్ వస్తుంది. సినిమా టీమ్‌కి ఆల్ ది బెస్ట్” అన్నారు.