మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌గా మరో మాసీ సాంగ్ ‘ఓలె ఓలె’ అనే డ్యాన్స్ నెంబర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఇక ఈ సాంగ్‌ను ఆగస్టు 5న సాయంత్రం 4.06 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. మరి ఈ పాటతో మాస్ రాజా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.