సాధారణంగా ఓ సినిమా కోసం పెట్టిన బడ్జెట్‌కు కొన్నిసార్లు లాభాలు వస్తాయి, మరికొన్నిసార్లు నష్టాలు వస్తాయి. పెట్టిన బడ్జెట్ మొత్తం కలెక్షన్స్ రూపంలో వస్తే అది సూపర్ హిట్ సినిమా అని.. పెట్టినదానికంటే ఎక్కువమొత్తం కలెక్షన్స్ వస్తే అది బ్లాక్‌బస్టర్ హిట్ అంటారు. కానీ, ఇటీవల ఓ సినిమా కలెక్ట్ చేసిన వసూళ్లు చూసి యావత్ సినీ ఎక్స్పర్ట్స్ షాక్ అవుతున్నారు. 100, 200 కాదు.. ఏకంగా 800 శాతం ప్రాఫిట్స్ తెచ్చి నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చింది ఈ సినిమా.
కన్నడలో రీసెంట్గా వచ్చిన ‘సు ఫ్రమ్ సో’ చిత్రం శాండిల్‌వుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కేవలం రూ.3 కోట్లు. అయితే, ఈ సినిమా ఇప్పటికే రూ.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు శాండిల్‌వుడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఈ లెక్కన నెట్ కలెక్షన్స్ రూ.30 కోట్లు ఉంటాయి. అంటే ఈ సినిమా కోసం పెట్టిన బడ్జెట్‌కు ఏకంగా 848 శాతం మేర వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.
‘మహావతార్ నరసింహా’ చిత్రంతో పాటు రిలీజ్ అయిన ఈ సినిమా ఎవరి ఊహలకు అందని విధంగా కలెక్షన్స్‌తో లాభాలు తెచ్చిపెట్టడం శాండిల్‌వుడ్‌లో హాట్ టాపిక్ అయింది.