పాక్‌ క్రికెటర్‌ తో పెళ్లి పై తమన్నా క్లారిటీ !

పాక్‌ క్రికెటర్‌ తో పెళ్లి పై తమన్నా క్లారిటీ !

Published on Aug 4, 2025 7:00 AM IST

పాక్‌ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ ను తమన్నా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై తమన్నా క్లారిటీ ఇచ్చింది. కేవలం ఇవి రూమర్స్‌ మాత్రమే అని తమన్నా వాటిని ఖండించింది. సోషల్‌ మీడియాలోనే ఇలాంటి గాసిప్స్‌ క్రియేట్‌ అవుతాయని తమన్నా చెప్పుకొచ్చింది. అలాగే, విరాట్‌ కోహ్లీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రూమర్స్‌ రావడంపై కూడా తమన్నా రియాక్ట్‌ అయింది. తాను విరాట్‌ను ఒకసారి మీట్‌ అయ్యానని తమన్నా తెలిపింది.

అన్నట్టు తమన్నా ‘MCA’‌ సినిమాలో విలన్‌గా నటించిన విజ‌య్ వ‌ర్మ‌తో కొంతకాలం ప్రేమ‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గోవాలో ఈ జంట తమ పెళ్లికి సంబంధించిన సెల‌బ్రేష‌న్స్‌ ను ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత ‘తమన్నా – విజయ్ వర్మ’ల పెళ్ళి ఆగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. మొత్తానికి ఇప్పట్లో తమన్నా పెళ్లి లేనట్టే. ఐతే, ఆ మధ్య ఓ సందర్భంలో తమన్నా తన పెళ్లి విషయంపై కూడా ఓపెన్‌ గా మాట్లాడింది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉందని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు