మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు రాబోతున్న భారీ చిత్రమే “వార్ 2”. తాను యాంటీ హీరోగా చేసిన ఈ భారీ సినిమాపై మంచి హైప్ నెలకొనగా మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేయనుంది. అయితే ఈ సినిమా కాకుండా తన నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తుండగా వాటిలో దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న క్రేజీ సీక్వెల్ చిత్రం “దే’వర’ 2” కూడా ఉంది.
మరి ఈ సినిమాపై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం మేకర్స్ వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లోపే సినిమాని స్టార్ట్ చేస్తారని వినిపిస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన సినిమా ఈ ఏడాది చివరికి పూర్తి కానుండగా ఆ తర్వాత దేవర 2 ని త్వరగా ఫినిష్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా త్రివిక్రమ్ తో ప్లాన్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ మేకోవర్ మొదలు పెట్టనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి తన లైనప్ లో మళ్ళీ ఏమన్నా మార్పులు జరుగుతాయేమో చూడాలి.