‘మాస్ జాతర’ రెండో సాంగ్ కి టైం ఖరారు!

‘మాస్ జాతర’ రెండో సాంగ్ కి టైం ఖరారు!

Published on Aug 3, 2025 1:31 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ చిత్రం “మాస్ జాతర”. సాలిడ్ హైప్ అందుకున్న ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసేసుకుంటుంది. ఇక ఆల్రెడీ వచ్చిన ఈ సినిమా మొదటి సాంగ్ మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సాంగ్ తర్వాత రెండో సాంగ్ కి ఇప్పుడు టైం ఫిక్స్ అయ్యింది.

భీమ్స్ సంగీతం అందించిన ఓలే ఓలే అనే ఈ సాంగ్ ని రేపు ఆగస్టు 4న ఉదయం 11 గంటల 8 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే అతి త్వరలోనే సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు