తమిళ ప్రేక్షకులతో పాటు యావత్ దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కూలీ ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న ఈ సినిమా మరోసారి తమిళ సినీ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్యూర్ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ కట్ అదిరిపోయింది.
ఇక తలైవా రజినీకాంత్ తనదైన స్వాగ్‌తో చేసే యాక్షన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. లోకేష్ తనదైన మార్క్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులకు కన్నులపండువగా అనిపిస్తుంది. భారీ క్యాస్టింగ్, అనిరుద్ ఎంగేజింగ్ మ్యూజిక్‌తో ట్రైలర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేశారు. రజినీకాంత్ ఎలివేషన్ పీక్స్‌లో ఉండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మొత్తానికి రజినీకాంత్ ఈసారి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేందుకు చాలా గట్టిగానే వస్తున్నాడనేది ఈ ట్రైలర్‌తో కన్ఫమ్ అయింది. ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా ఆగస్టు 14న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి