నేషనల్ అవార్డుల విషయంలో మూవీ లవర్స్ డిజప్పాయింట్మెంట్!

నేషనల్ అవార్డుల విషయంలో మూవీ లవర్స్ డిజప్పాయింట్మెంట్!

Published on Aug 2, 2025 10:00 AM IST

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులలో జాతీయ అవార్డులు కూడా ఒకటి. అయితే ఎప్పటిలానే ఈసారి కూడా జాతీయ అవార్డుల లిస్ట్ బయటకి వచ్చింది. పలు విభాగాల్లో ఎన్నో సినిమాలు నటీనటులకు అవార్డులు వరించాయి. అయితే తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో అన్ని ముఖ్య భాషల సినిమా పరిశ్రమలకి కూడా లిస్ట్ వచ్చేసింది. కానీ వీటి విషయంలో మాత్రం మూవీ లవర్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.

ముఖ్యంగా ఈ సినిమాలకి నటులకి వస్తాయి అనుకున్న వాటికే రాకపోవడం అనేది మూవీ లవర్స్ ని దారుణంగా నిరాశ చెందించింది. అనిమల్ సినిమాలో రణబీర్, మళయాళ చిత్రం ఆడు జీవితం గోట్ లైఫ్ లాంటి సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన లైఫ్ టైం పెర్ఫామెన్స్ కి కూడా ఉత్తమ అవార్డు రాకవడం ఒకింత అందరికీ షాకిచ్చింది. అలాగే 12త్ ఫెయిల్, సామ్ బహుదూర్, ఇలా మరిన్ని చిత్రాలు నటీనటుల విషయంలో అన్యాయమే జరిగింది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

తాజా వార్తలు