మహేష్ అడ్డాలో ‘అతడు’ సాలిడ్ స్టార్ట్!

మహేష్ అడ్డాలో ‘అతడు’ సాలిడ్ స్టార్ట్!

Published on Aug 2, 2025 8:00 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర నుంచే ఒక ఎపిక్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వచ్చే లోపు మహేష్ బాబు అభిమానులకి తన పాత సినిమాలే థియేటర్స్ లో ట్రీట్ ఇస్తున్నాయి. ఇలా తన క్లాసిక్ సినిమాలు మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చి భారీ రెస్పాన్స్ ని కొల్లగొడుతుండగా ఈ ఏడాది తన పుట్టినరోజు కానుకగా అవైటెడ్ రీరిలీజ్ “అతడు” ఇప్పుడు వస్తుంది.

అయితే మహేష్ బాబుకి స్ట్రాంగ్ జోన్ అయినటువంటి యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ ఈ సినిమా క్రేజీ వసూళ్లు రాబడుతుంది. ఇంకా వారం గడువు ఉండగానే ఆల్రెడీ 10 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో అతడు సినిమా ఏ రేంజ్ హైప్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఖలేజా రీరిలీజ్ తో యూఎస్ మార్కెట్ లో ఆల్ టైం రికార్డు నంబర్స్ సెట్ చేసిన మహేష్ అతడుతో ఎలాంటి నంబర్స్ సెట్ చేస్తాడో చూడాలి.

తాజా వార్తలు