బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన రీసెంట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “సితారే జమీన్ పర్”. దర్శకుడు ఆర్ ఎస్ ప్రసన్న తెరకెక్కించిన ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలిచింది. భారీ వసూళ్లు అందుకోకపోయినప్పటికీ మంచు నంబర్స్ నే అందుకుంది.
అయితే ఈ సినిమా విషయంలో మాత్రం అమీర్ ఖాన్ మొదటి నుంచీ స్ట్రిక్ట్ గా ఉన్నారు. తన సినిమాలు ఏ ఓటిటికి ఇచ్చేది లేదు అని ఖరాకండిగా చెప్పేసిన అమీర్ ఖాన్ ఇపుడు చెప్పిందే చేశారు. తన సినిమా ఇప్పుడు ఓటిటి డేట్ కాకుండా డిజిటల్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ సినిమాని యూట్యూబ్ లో మాత్రమే చూడొచ్చు.
అయితే ఓటిటిలు రాకముందు ఫార్మాట్ కొంతమొత్తం చెల్లించి ఈ సినిమా చూసే విధంగా కన్ఫర్మ్ చేశారు. సో సితారే జమీన్ పర్ చూడాలి అంటే యూట్యూబ్ లో 100 కట్టి చూడాల్సిందే. ఈ రకంగా మాత్రం ఓటిటి ట్రెండ్ కి తాను ట్విస్ట్ ఇచ్చి ఆగస్ట్ 1 నుంచి సినిమా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ఇది ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి.