కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?

కింగ్డమ్: యూఎస్ లో ముందుగానే ప్రీమియర్ షోలు.. ఎన్ని గంటల నుంచి?

Published on Jul 29, 2025 7:20 AM IST

Kingdom

ది విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది మంచి వార్త. విజయ్ కొత్త సినిమా ‘కింగ్డమ్’ విడుదలకు రెడీ అయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది.

ఈసారి సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలాంటి పెయిడ్ ప్రీమియర్ షోలు ఉండవని చిత్రబృందం ఖరారు చేసింది. కానీ, ఆసక్తికరంగా, సినిమా తొలి ప్రీమియర్ షో మాత్రం ఇండియాలో కాకుండా అమెరికాలోని కొన్ని థియేటర్లలో బుధవారం రాత్రి 11 గంటలకు (IST) పడనున్నాయి. అంటే, అక్కడి తెలుగు ప్రేక్షకులు భారతదేశంలో విడుదలకంటే ముందే సినిమాను చూసే అవకాశం పొందారు.

యూఎస్ లో తూర్పు (EST) ప్రాంతంలో మధ్యాహ్నం 1:30కి, సెంట్రల్‌ లో (CST) 12:30కి అలాగే పశ్చిమ తీరంలో (PST) ఉదయం 10:30కి ప్రీమియర్ షోలు మొదలవుతాయి.

ఇక మనదేశంలో, విడుదల రోజున ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున 4 గంటలకు లేదా 7 గంటలకు స్పెషల్ షోలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాను నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మించగా. సత్యదేవ్, అయ్యప్ప శర్మ, వెంకటేష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు మంచి రెస్పాన్స్ అందుకోగా భారీ అంచనాల నడుమ ‘కింగ్డమ్’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు