బాక్సాఫీస్: వరల్డ్ వైడ్ ‘హరిహర వీరమల్లు’ టార్గెట్ ఎంత?

బాక్సాఫీస్: వరల్డ్ వైడ్ ‘హరిహర వీరమల్లు’ టార్గెట్ ఎంత?

Published on Jul 22, 2025 1:00 PM IST

hari-hara-veera-mallu

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకి తెర పడబోతోంది. అయితే ఈ సినిమా అనుకున్నట్టుగా ముందే వచ్చేసి ఉంటే ఇంకా గ్రాండ్ రిలీజ్ ఉండేది భారీ బిజినెస్ కూడా జరిగి ఉండేది.

కానీ పలు వాయిదాలు అనంతరం వస్తున్నా ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి టార్గెట్ నే పెట్టుకొని వస్తున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ ట్రేడ్ టాక్ ప్రకారం హరిహర వీరమల్లు చిత్రం 120 కోట్లకి పైగా ప్రపంచ వ్యాప్త బాక్సాఫీస్ టార్గెట్ ని పెట్టుకొని వస్తున్నట్టుగా ఇపుడు టాక్.

ఇక ఇందులో ఏకంగా 100 కోట్లు బిజినెస్ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిందట. సో ఈ టార్గెట్ తో వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసేందుకు వస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే ఏ ఎం రత్నం ఖుషి తర్వాత మళ్ళీ గుర్తుండిపోయే రేంజ్ సినిమా చేయాలని పవన్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు