టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క నటుడిగానే కాకుండా మరిన్ని అంశాల్లో కూడా ప్రత్యేక టాలెంట్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో తాను యాక్షన్ కొరియోగ్రాఫర్ గా చేసిన సినిమాలు సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా పలు సినిమాల్లో తాను యాక్షన్ సీక్వెన్స్ లు కంపోజ్ చేయగా మళ్ళీ ఎన్నో ఏళ్ళు తర్వాత యాక్షన్ కొరియోగ్రఫీ తాను చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు.
అది కూడా మొత్తం 18 నిమిషాల ఎపిసోడ్ ని తానే డిజైన్ చేసినట్టుగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో తాను కన్ఫర్మ్ చేశారు. అది కూడా మొత్తం క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అట. పవన్ యాక్షన్ కొరియోగ్రఫీ అంటే ఖచ్చితంగా అందులో మంచి ప్రత్యేకత ఉంటుంది. మరి ‘హరిహర వీరమల్లు’ క్లైమాక్స్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.