వాయిదా పడ్డ బాలీవుడ్ క్రేజీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

వాయిదా పడ్డ బాలీవుడ్ క్రేజీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Published on Jul 20, 2025 3:00 AM IST

Son-Of-Sardar2

బాలీవుడ్‌లో సీక్వెల్ చిత్రాలు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇక ఈ కోవలోనే తెరకెక్కిన లేటెస్ట్ సీక్వెల్ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’. హీరో అజయ్ దేవ్గన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను విజయ్ కుమార్ అరోరా డైరెక్ట్ చేయగా ఇందులో భారీ తారాగణం నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది.

అయితే, ఈ చిత్రాన్ని మంచి అంచనాల మధ్య జూలై 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర ఇప్పటికే ప్రకటించింది. కానీ, ఇప్పుడు ఈ రిలీజ్ డేట్‌ను మేకర్స్ వాయిదా వేశారు. ఈ చిత్రాన్ని వారం రోజుల తర్వాత ఆగస్టు 1న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో అజయ్ దేవ్గన్‌తో పాటు మృణాల్ ఠాకూర్, రవి కిషన్, సంజయ్ మిశ్రా, నీరూ బాజ్వా, చంకీ పాండే తదితరులు నటిస్తున్నారు. మరి ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే ఆగస్టు 1 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు