ప్రతీ శుక్రవారం లానే ఈసారి కూడా ఆడియెన్స్ ని అలరించేందుకు పలు సినిమాలు వచ్చేసాయి. ఈ మధ్య కాలంలో చాలా శుక్రవారాలు మంచి సినిమాలు కానీ నోటెడ్ నటుల నుంచి కానీ సినిమాలు పడలేదు. అయితే ఈ ఫ్రైడే మాత్రం మొత్తం పాన్ ఇండియా లెవెల్లో నలుగురు కొత్త నటులు తమ అదృష్టం పరీక్షించుకోడానికి వెండితెర ఎంట్రీ ఇచ్చారు.
టాలీవుడ్ నుంచి ఎవరు?
మన తెలుగు సినిమా నుంచి రానా దగ్గుబాటి సమర్పణలో ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే సినిమాతో హీరో హీరోయిన్స్ మనోజ్ చంద్ర, మోనికాలు డెబ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో తమ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకున్నారు.
కన్నడ, తెలుగు కలిపి..
ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధనరెడ్డి తనయుడు కిరీటి “జూనియర్” అంటూ సాలిడ్ డెబ్యూని నేడే ఇచ్చాడు. సినిమా కంటెంట్ పక్కన పెడితే తన మొదటి సినిమా తోనే అందరి దృష్టి తాను తన టాలెంట్ తో ఆకర్షించాడు.
హిందీ సినిమా నుంచే ఇద్దరు నటీ నటులు..
బాలీవుడ్ సినిమా దగ్గర మాత్రం ఇద్దరు కొత్త నటీనటులు డెబ్యూ అందించారు. అనన్య పాండే కజిన్ గా అహాన్ పాండే నటించిన లవ్ డ్రామా “సైయారా” ఒక ఊహించని హైప్ ని నార్త్ లో సెట్ చేసుకుంది. దీనికి మంచి ఓపెనింగ్స్ దక్కే సూచనలు కూడా ఉన్నాయి.
ఇక మరొకరు యువ నటి సుభాగ్ని దత్ లీడ్ పాత్రలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా “తన్వి ది గ్రేట్”. ఈ సినిమాకి కూడా డీసెంట్ బజ్ ఉండగా ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించడం అనేది విశేషం.
ఇలా ముఖ్యమైన పాన్ ఇండియా సినిమా మార్కెట్ ఇండస్ట్రీస్ నుంచి యువ నటీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చేసారు. మరి వీరిలో ఎవరికి మంచి భవిష్యత్తు ఉంటుందో కాలమే నిర్ణయించాలి.