తెలుగు రాష్ట్రాల వరకు మన తెలుగు బిగ్ స్టార్స్ సినిమాలకి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు. అందులోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోస్ కి అయితే అసలు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో మినిమమ్ ప్రమోషన్స్ చేయకపోయినా సినిమాకి బజ్ కామన్ ఆడియెన్స్ లో లోపిస్తుంది.
అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ మేకర్స్ ని ప్రమోషన్స్ చేయమని అభిమానులు అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు సరిగ్గా హరిహర వీరమల్లు సినిమాకి ఇదే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల వరకు ఓకే కానీ పాన్ ఇండియా భాషల్లో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇంకా వారమే ఉన్నప్పటికీ ప్రమోషన్స్ పెద్దగా కనిపించడం లేదు.
అయితే దీనిపై అభిమానులో యాంటి అభిమానుల్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ వేస్తున్నారు. హరిహర వీరమల్లుపై ఫేక్ ప్రమోషన్స్ వైరల్ అయ్యిపోతున్నాయి. బుర్జ్ ఖలీఫా నుంచి విమానాలు, తిను బండారాల ప్యాకెట్స్ వరకు నిజమో అబద్దమో అని తెలిసే లోపే ఈ ఫేక్ ప్రమోషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మేకర్స్ ఎలాగో చెయ్యట్లేదు కాబట్టి అభిమానులే కొందరు వీటిని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.