అందాల భామ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరదా’. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా కంటెంట్‌పై మంచి అంచనాలు ఉండటంతో ఈ చిత్రాన్ని వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.