హాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సూపర్ హీరో చిత్రాల్లో ‘సూపర్‌మ్యాన్’ కూడా ఒకటి. ఈ సూపర్ హీరోకు సంబంధించిన లేటెస్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాకు ఫారిన్ దేశాల్లో ఎంత క్రేజ్ ఉందో, మన ఇండియాలోనూ అంతే క్రేజ్ ఉంది. అయితే, హాలీవుడ్ చిత్రాల్లో కామన్‌గా ఉండే సీన్స్‌ను ఇండియాలో సెన్సార్ చేస్తారని అందరికీ తెలిసిందే. కానీ, ప్రస్తుత తరానికి ఇది నచ్చడం లేదు.
తాజాగా రిలీజ్ అయిన సూపర్‌మ్యాన్ సినిమాలో ఇలాంటివి చాలా సీన్స్ సెన్సార్ బోర్డ్ తొలగించింది. అయితే 33 సెకన్ల ముద్దు సీన్ కూడా ఈ తొలగించిన సీన్స్‌లో ఉంది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యను తెచ్చిపెడుతోంది. ఇండియన్ ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌కు అలవాటు పడ్డారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సెన్సార్ బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ శ్రేయా ధన్వంతరి కూడా ఉంది.
తమ డబ్బు, సమయం వెచ్చించి సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు ఏం చూడాలో నిర్ణయించుకునే అధికారం ఉందని.. సినిమా చూసే అభిమానులకు స్వేచ్ఛ ఇవ్వాలని ఆమె ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.